Politics10th Sep 12:39 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలడిగిన జగన్

వైసీపీ అధినేత వైయస్ జగన్ మీడియా సమావేశం వేదికగా ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలడిగారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నపత్రం తయారీ జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని

ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలడిగిన జగన్
వైసీపీ అధినేత వైయస్ జగన్ మీడియా సమావేశం వేదికగా ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలడిగారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నపత్రం తయారీ జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, పర్యవేక్షణ రెండు విధులనూ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇక్కడే స్కామ్ కు తొలి అడుగు పడిందన్నారు. రెండో ప్రశ్నగా ప్రశ్నాపత్రాలు తయారు చేసే SCERTలో అవుట్ సోర్సింగ్ కింద పని చేసే నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? వచ్చినా అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అతని పేరు మొదటి ర్యాంకులో ఉన్న మెరిట్ లిస్టును మళ్లీ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అతని డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతన్ని వెరిఫికేషన్ కు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తనను వెరిఫికేషన్ కు పిలవలేదని నవీన్ డీఎస్సీ కన్వీనర్ కు లేఖ రాశాడు, దీనిపై కోర్టుకు కూడా వెళ్లాడని పేర్కొన్నారు. మూడో ప్రశ్నగా గతంలో ఉన్న స్పోర్ట్స్ కోటా జీవోలు మార్చి 372 పోస్టులను పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఎలా భర్తీ చేశారని ప్రశ్నించారు. గతంలో ఉన్న 2 శాతం స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచి, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి జీవో నం. 4, 47 ఎందుకు తీసుకొచ్చారని జగన్ అడిగారు.
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
YSRCP
DSC Recruitment
DSC Scam Allegations
Mega DSC
DSC Question Paper
SCERT
డీఎస్సీ మెరిట్ లిస్ట్
స్పోర్ట్స్ కోటా
జీవో 4
జీవో 47
ఉపాధ్యాయ నియామకాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏపీ విద్య
Scroll for the next article