Education4th Sep 05:57 PMSunil Byrisetty1 min read

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలి

మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని వైయస్సార్సీపీ అధినే

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలి
మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారని అడిగారు. డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకని సీఎంను ప్రశ్నించారు. ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చేత రాజీనామా చేయించకుండా, అధికార బలంతో, అబద్ధాలుచెప్తూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒన్‌-టు-ఒన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారని అడిగారు. దరఖాస్తు దశలోనే రిజెక్ట్‌ కావాల్సిన వ్యక్తి, ఆ తర్వాత దశలుకూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడని నిలదీశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు శాప్ నోటిఫికేషన్ ను ట్వీట్ లో జత చేశారు.
Andhra Pradesh Education
YS Jagan Mohan Reddy
YSRCP
Mega DSC
DSC 2025
DSC Scam
CBI Probe
Teacher Recruitment
TET
SGT Posts
Recruitment Irregularities
Nara Lokesh
Chandrababu Naidu
Kurnool
SAAP
Scroll for the next article