National26th Aug 01:57 PMSunil Byrisetty1 min read
కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణ.. ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చాయ్ పే చర్చ కార్యక్రమం కోసం 20 మంది ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 28న ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లనుండటంతో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చాయ్ పే చర్చ కార్యక్రమం కోసం 20 మంది ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 28న ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లనుండటంతో, ఈ భేటీ ముగిసిన వెంటనే లేదా అదే రోజు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందనే ప్రచారం మొదలైంది. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల పార్టీ జాతీయ కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలో కేబినెట్ కూడా మారుతందని భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు పొందిన తర్వాత సంస్థాగతంగా పలు మార్పులు చేసిన నబీన్, కొత్త తరం నేతలకు, బీసీ, మహిళా విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో నూతన బాధ్యతలు చేపట్టిన వారిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉండటంతో, ఒకరికి ఒకే పదవి నిబంధన, సంస్థాగత బాధ్యతల దృష్ట్యా కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి చోటు కల్పిస్తారనే చర్చ నడుస్తోంది.