TTD31st Aug 05:37 PMSunil Byrisetty1 min read
టీటీడీ ఆధ్వర్యంలో గోకులాష్టమి 4న
సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాల
సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా టీటీడీ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. హిందూధర్మంలో గోపూజలకున్న విశిష్ట స్థానం దృష్ట్యా టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. గోకులాష్టమి రోజున భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు అయ్యే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదం. భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. కృష్ణాష్టమి రోజున గోశాలలో టీటీడీ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది. తెల్లవారు జామున 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7:30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు.