TTD14th Jul 04:41 PMSunil Byrisetty1 min read

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో సర్వదర్శనం భక్తుల కోసం శాశ్వత షెల్టర్లు నిర్మించాలని తీర్మానించింది. ఆళ్వార్ ట్యాంక్ దగ్గర సౌకర్యాలకు రూ.6.31 కోట్లు కేటా

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో సర్వదర్శనం భక్తుల కోసం శాశ్వత షెల్టర్లు నిర్మించాలని తీర్మానించింది. ఆళ్వార్ ట్యాంక్ దగ్గర సౌకర్యాలకు రూ.6.31 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. కుమారధార, పసుపుధార డ్యామ్‌లకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరు చేసింది. తిరుమలలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటు చేయనుంది. పాత ఘన వ్యర్థాల శుద్ధికి రూ.5 కోట్లు కేటాయించింది. TTD ఆలయాల్లో అగ్నిమాపక వ్యవస్థలకు రూ.2.35 కోట్లు ప్రకటించింది. ఒంటిమిట్టలో 100 గదుల విశ్రాంతి భవన నిర్మాణం నిర్మించనుంది. శ్రీవారి 2027 డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు నిర్ణయం తీసుకుంది. వేద పారాయణం కోసం 791 మంది వేద పండితుల నియామకంతోపాటు కళాకారుల పారితోషకాల పెంపునకు టీటీడీ ఆమోదం తెలిపింది.
Andhra Pradesh
Temple
TTD
Tirumala
Tirupati
TTD Board
Tirumala Temple
Devotee Facilities
వేద పండితులు
ఒంటిమిట్ట
తిరుమల అభివృద్ధి
Scroll for the next article