Agriculture6th Sep 11:40 AMSunil Byrisetty1 min read
పొగాకు రైతులకు భరోసా
ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 FCV పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట
ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 FCV పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 4 నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల FCV పొగాకు మార్కెట్ అయిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్‌కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా, అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. ఇప్పటివరకు నమోదైన సగటు ధర కిలోకు రూ.209.83గా ఉందని వెల్లడించారు. గత ఏడాది ఇదే 132 వేలం రోజుల నాటికి 140.27 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ కాగా, తుది సగటు ధర కిలోకు రూ.248.86గా నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో సర్ప్లస్ ఏర్పడటంతో కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ, ఇటీవల వేలాల్లో కొనుగోలుదారుల స్పందన, పోటీ గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.