TTD16th Aug 11:36 AMSunil Byrisetty1 min read
నవంబర్ కోటా విడుదల తేదీలు ఇవే!
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు సంబంధించి నవంబర్ నెల కోటా విడుదల తేదీలు ప్రకటించారు. శ్రీవారి దర్శనం, సేవలు, గదుల కోటా విడుదల తేదీలు ప్రకటించారు. 18న ఉ.10కి సుప్రభాతం, తోమాల, అర
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు సంబంధించి నవంబర్ నెల కోటా విడుదల తేదీలు ప్రకటించారు. శ్రీవారి దర్శనం, సేవలు, గదుల కోటా విడుదల తేదీలు ప్రకటించారు. 18న ఉ.10కి సుప్రభాతం, తోమాల, అర్చన సేవల కోటా, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా విడుదల చేస్తారు. 20న ఉ.10కి నిత్యసేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, 21న ఉ.10కి నవంబర్ నెల ఆర్జిత సేవల టికెట్లు విడుదల చేయనున్నారు. 21న మ.3కు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలవుంటాయి. 24న ఉ.11 గం.కు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. 24న మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల విడుదల చేయనున్నారు. 25న ఉ.10కి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మ.3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా విడుదలవుతాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం ఉంది.