TTD7th Aug 04:04 PMSunil Byrisetty1 min read
తిరుమల వెళ్తున్నారా.. సీనియర్ సిటిజన్స్ ఇలా చేయాలి
తిరుమల దర్శనానికి లక్షలాది మంది భక్తులు వెళ్తున్న సమయంలో సీనియర్ సిటిజన్లు తామెలా అని ఆందోళన పడుతుంటారు. అయితే తిరుమలలో 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు TTD ఉచిత ప్రత్యేక ప్రివిల
తిరుమల దర్శనానికి లక్షలాది మంది భక్తులు వెళ్తున్న సమయంలో సీనియర్ సిటిజన్లు తామెలా అని ఆందోళన పడుతుంటారు. అయితే తిరుమలలో 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు TTD ఉచిత ప్రత్యేక ప్రివిలేజ్డ్ దర్శనం కల్పిస్తుంది. భక్తులు ముందుగా Official TTD Devasthanams Website ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత స్లాట్‌లను బుక్ చేసుకోవాలి. దర్శన సమయం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. భక్తులు మధ్యాహ్నం 1:00 గంటలకే తిరుమలలోని సుపథం దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి. 65 సంవత్సరాల వయసు పూర్తి అయి ఉండాలి. భార్యాభర్తలిద్దరికీ 65 ఏళ్లు ఉంటే దంపతులు కలిసి వెళ్ళవచ్చు; ఒకరికి వయస్సు ఉంటే మరొకరు అటెండెంట్ గా వెళ్ళడానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది. ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఆన్‌లైన్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఈ కోటాలో ఒకసారి దర్శనం చేసుకుంటే మళ్లీ 90 రోజుల వరకు అవకాశం ఉండదు.