Education17th Aug 03:26 PMSunil Byrisetty1 min read

రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలు

రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస

రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలు
రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ బీసీ గురుకులాల భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. ఆరు బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. 50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్లను గురుకులాల్లో విలీనం చేస్తున్నామన్నారు.
Andhra Pradesh
Minister Savitha
Mahatma Jyotirao Phule Gurukuls
MJP BC Gurukuls
BC Welfare
Permanent Buildings
BC Hostels
గురుకుల పాఠశాలలు
బాలికల గురుకులాలు
జూనియర్ కళాశాలలు
విద్య
రాయలసీమ
ఉత్తరాంధ్ర
Scroll for the next article