Sports3rd Aug 12:06 PMSunil Byrisetty1 min read

మన వాళ్లు బాగా ఆడారన్న పవన్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 39 పతకాలు సాధించడం దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం మన అథ్లెట్ల పట్ట

మన వాళ్లు బాగా ఆడారన్న పవన్
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 39 పతకాలు సాధించడం దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం మన అథ్లెట్ల పట్టుదల, పోరాట పటిమకు నిదర్శనమని తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమించిన కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషికి అభినందనలు తెలిపారు. పోటీల ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుత క్రీడాస్ఫూర్తి చూపారని ఒక ట్వీట్ లో కొనియాడారు. రికార్డులు సృష్టిస్తూ దేశ క్రీడారంగాన్ని నూతన దిశగా తీసుకెళ్తున్నారని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలకు ఈ ప్రయాణం స్ఫూర్తినివ్వాలని పవన్ పేర్కొన్నారు.
Indian Sports
Andhra Pradesh
Pawan Kalyan
Commonwealth Games
India
Indian Athletes
Medals
Team India
Sports
Deputy Chief Minister
Scroll for the next article