Agriculture12th Aug 04:43 PMSunil Byrisetty1 min read
వరికి బీమా గడువు 15 వరకే!
ఎల్ నినో పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ల
ఎల్ నినో పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని వ్యవసాయ శాఖ సూచించింది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవటానికి ఇదే చివరి అవకాశం. గడువు లోగా బీమా ప్రీమియం చెల్లిస్తే.. ఈ-పంట నమోదు వివరాలను తర్వాతైనా చేయించుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. ముందస్తు పంటల బీమాకు ఈ-పంట నమోదు అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం పంట సాగుపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి, గడువులోగా బీమా ప్రీమియం చెల్లిస్తే చాలని పేర్కొంది.