TTD13th Sep 02:33 PMSunil Byrisetty1 min read

తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు

తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో

తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడమైనది.
Tirumala News
Tirumala
TTD
Tirumala Vehicles
Private Vehicles
Tirumala Traffic
Tirupati
TTD Clarification
సోషల్ మీడియా ప్రచారం
తప్పుడు వార్తలు
భక్తులు
తిరుమల ఆలయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article