Politics12th Sep 04:40 PMSunil Byrisetty1 min read
గుట్కా నానికి లోకేష్ గురించి మాట్లాడతారా?
క్యాసినోలు నడుపుకునే గుట్కా కొడాలి నానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడే కనీస అర్హత, స్థాయి లేవని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు. చదువు సంస్కారం ల
క్యాసినోలు నడుపుకునే గుట్కా కొడాలి నానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడే కనీస అర్హత, స్థాయి లేవని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు. చదువు సంస్కారం లేని కొడాలి నాని ఏడో తరగతి ఫెయిలై, లారీ క్లీనర్‌గా పనిచేసిన చరిత్ర కలిగిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. విద్యావంతుడైన లోకేష్ పై నోటికొచ్చినట్లు ఏకవచనంతో పిచ్చి కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన విషయాన్ని మరిచిపోయి, వెన్నుపోటు పొడిచి సైకో జగన్ పంచన చేరి బూతుల పంచాంగం అందుకున్నారని మండిపడ్డారు.
ప్రజల సమస్యలపై నిలదీసే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, సభకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కుంటూ ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు.
నియోజకవర్గాల్లో కొల్లగొట్టే పందికొక్కుల్లా తయారైన వల్లభనేని వంశీ, పేర్ని నాని లాంటి దోపిడీదారులకు గుట్కా నాని నిజాయితీపరులుగా కనిపిస్తున్నారని సుభాష్ దుయ్యబట్టారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం మూడు డీఎస్సీలను విజయవంతంగా నిర్వహించబోతోందని స్పష్టం చేశారు.