Sports30th Aug 12:24 PMSunil Byrisetty1 min read

క్రీడాకారుల ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం

అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన 264 మంది క్రీడాకారులకు రూ.8.8 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేశామని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నార

క్రీడాకారుల ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం
అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన 264 మంది క్రీడాకారులకు రూ.8.8 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేశామని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మట్టిలో దాగిన మాణిక్యాలను వెలికితీసి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 2036లో భారత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో 10 శాతం మంది క్రీడాకారులు తెలుగువారే ఉండేలా ప్రోత్సహిస్తామని వివరించారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లోనూ క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
Ap sports news
Sports Development
Athletes
Sports Incentives
Andhra Pradesh
AP Government
SAP Chairman Ravi Naidu
Ravi Naidu
International Sports Day
Sports Awards
Amaravati Championship
Scroll for the next article