Business Type23rd Jan 04:07 PMSunil Byrisetty1 min read

బాబోయే బంగారం.. వామ్మోయ్ వెండి!

గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లకు మాత్రం విశ్రాంతి దొరకటం లేదు. 2026లో ఈ రెండు లోహాలు అస్సలు భారతీయుల ఊహలకు సైతం అందనంతగా పెరుగుతూ అరే జీవితంలో ఆభరణాలు కొనుక్కోగలమా అనే అనుమానాన్ని కలిగి

బాబోయే బంగారం.. వామ్మోయ్ వెండి!
గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లకు మాత్రం విశ్రాంతి దొరకటం లేదు. 2026లో ఈ రెండు లోహాలు అస్సలు భారతీయుల ఊహలకు సైతం అందనంతగా పెరుగుతూ అరే జీవితంలో ఆభరణాలు కొనుక్కోగలమా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. కొనాలనుకుంటున్న వాళ్లు తాజా రేట్లను గమనించండి ఇవాళ్టివి. గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. శుక్రవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.15,971 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.14,640 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3 లక్షల 60 వేల వద్ద ఉంది.
Gold Rates
Silver Rates
Precious Metals
Gold Price Today
Silver Price Today
Telugu States
Hyderabad Gold Rate
Vijayawada Gold Rate
Bullion Market
Scroll for the next article