Agriculture24th Aug 03:11 PMSunil Byrisetty1 min read

ఏటా రూ. వంద కోట్ల కరివేపాకు!

గ్రామాల్లో ఇంటింటా పెరట్లో పెరిగే కరివేపాకు అంటే చిన్నచూపుగా చూస్తుంటారు. కానీ ఇప్పుడు అది వందల కోట్ల వ్యాపారం చేస్తోంది. పోషక విలువలు పుష్కలంగా ఉన్న కరివేపాకును తెలుగు రాష్ట్రాల్ల

ఏటా రూ. వంద కోట్ల కరివేపాకు!
గ్రామాల్లో ఇంటింటా పెరట్లో పెరిగే కరివేపాకు అంటే చిన్నచూపుగా చూస్తుంటారు. కానీ ఇప్పుడు అది వందల కోట్ల వ్యాపారం చేస్తోంది. పోషక విలువలు పుష్కలంగా ఉన్న కరివేపాకును తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ కరివేపాకుతో ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి, అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరు, ప్రకాశం జిల్లా దర్శి, వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్‌ శివార్లలో కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటగా సాగు చేస్తున్న కరివేపాకు రాష్ట్రంలో 3000 ఎకరాల్లో పండుతోందని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ అంచనా.
Andhra Pradesh Agriculture
Curry Leaves
Agriculture Business
Telangana Agriculture
Export Crops
Guntur
Anantapur
Prakasam
Kadapa
Krishna District
Revenue Crops
Leafy Vegetables
Farming Success
30 ఏళ్ల వరకు దిగుబడి
తెలుగు రాష్ట్రాల్లో కరివేపాకు సాగు
Scroll for the next article