Business Type1st Sep 12:54 PMSunil Byrisetty1 min read
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు,
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థల నిర్వహణ భారం మరింత పెరగనుంది. ఐఓసీఎల్ ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. ముంబైలోనూ రూ.9.50 పెరగడంతో సిలిండర్ ధర రూ.2,701కి చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11 పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,985 నుంచి రూ.2,996కి చేరింది. చెన్నైలో రూ.10.50 పెరగడంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.2,916.50గా నమోదైంది.
ఆగస్టులో స్వల్పంగా ధర తగ్గించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు.. మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.