Agriculture27th Jul 04:50 PMSunil Byrisetty1 min read

ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు

ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎ

ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు
ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు.. రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రొత్సహించాలని సూచించారు. దీని నిమిత్తం క్యాంపెయిన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏయే పంట సాగు చేయాలనేదానిపై రైతులకు వివరించాలని చెప్పారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.
Andhra Pradesh
N Chandrababu Naidu
El Niño
Farmers
Agriculture
Crop Insurance
Farmer Awareness
Alternative Crops
వ్యవసాయ శాఖ
ఏపీ ప్రభుత్వం
రైతు సంక్షేమం
పంటల సాగు
Scroll for the next article