Education30th Aug 04:08 PMSunil Byrisetty1 min read

గిరిజన విద్యార్థులకు NEET, IIT-JEE శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచి, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో

గిరిజన విద్యార్థులకు NEET, IIT-JEE శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచి, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఏర్పాటు చేస్తున్నట్లు గిరిజన & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన విద్య, మెరుగైన అవకాశాలు, బంగారు భవిష్యత్తు అందించాలన్నదే లక్ష్యమన్నారు. ఈ కేంద్రంలో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ST విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారం, NEET, IIT-JEE కోచింగ్ అందిస్తున్నారు. 600 మంది విద్యార్థుల్లో 300 మంది బాలురు, 300 మంది బాలికలు ఉంటారు. విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ప్రముఖ కోచింగ్ సంస్థ M/s Physics Wallah, Noidaను కోచింగ్ ఏజెన్సీగా నియమించారు.
Ap news
Tribal Students
NEET Coaching
IIT JEE Coaching
Center of Excellence
CoE
Marikavalasa
Visakhapatnam
Andhra Pradesh
Gummidi Sandhyarani
రెసిడెన్షియల్ స్కూల్
ఫిజిక్స్ వాలా
పోటీ పరీక్షలు
ఉన్నత విద్య
విద్యార్థుల సంక్షేమం
విద్యాభివృద్ధి
Scroll for the next article