Health29th Aug 11:40 AMSunil Byrisetty1 min read
‘క్యాష్‌లెస్’ భ్రమలే!
భారతదేశంలో నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి రాలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇంత ఖరీదైన వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. వైద్యం ఉందని తెలిసి కూడా చేయించుకోలేకపోవడం కంటే దురదృష
భారతదేశంలో నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి రాలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇంత ఖరీదైన వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. వైద్యం ఉందని తెలిసి కూడా చేయించుకోలేకపోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఇంతగా ఎదిగిపోయిన వైద్యం భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉన్నదా అంటే ‘లేదు’ అనే స్పష్టంగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా వైద్యం అందించగల సత్తా మన ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ, ఆ సౌకర్యాన్ని పొందే స్తోమత మన దేశంలో పది శాతం మందికి కూడా లేదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. చేయించుకున్న వారి ఇక్కట్లు చూస్తే కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారు కూడా సందిగ్ధంలో పడతారు. ఇన్సూరెన్స్ చేయించడానికి శ్రద్ధ చూపే ఏజెంట్లు, వారి బతుకుతెరువు కోసం రోగం వస్తే బాగుండు అనుకునే రీతిలో తీపి కబుర్లు చెబుతారు. తీరా రోగం వచ్చాక కంపెనీ వారు పెట్టే కొర్రీలు చూసినప్పుడు రోగం తాలూకు బాధ పదింతలవుతుంది. ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు ఏజెంట్ అడగని అనేక విషయాలను క్లెయిమ్ సమయంలో కంపెనీ ఆరా తీస్తుంది. ‘ఆయుష్మాన్ భారత్’ వంటి పథకాలు రూపొందించడంలో ప్రభుత్వాలకు సదుద్దేశం ఉన్నప్పటికీ, మన ప్రభుత్వ ఆసుపత్రులలో తగినన్ని అత్యాధునిక సౌకర్యాలు లేవు. ఇన్సూరెన్స్ కంపెనీలు పారదర్శకతను పాటించకపోవడం, ఆరోగ్య బీమాను కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే చూడటం వల్లనే ఇటువంటి దుస్థితి తలెత్తుతోంది. వీటిపై ప్రభుత్వాలే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.