Sports4th Jan 12:29 PMSunil Byrisetty1 min read

ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు

ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడం ప్రధాన

ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు
ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోటీలకు విజయవాడ జోన్ పరిధిలోని ఎస్పీఎఫ్ యూనిట్లు అయిన విజయవాడ గాడ్స్, ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎయిర్‌పోర్ట్, డా. ఎన్.టి.టి.పి.ఎస్. యూనిట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి అన్ని యూనిట్లకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీఎఫ్ ఇతర అధికారులు, గవర్నమెంట్ ప్రెస్ డీజిఎం మోహన్ కుమార్ పాల్గొని, పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో తమ సహకారాన్ని అందించారు. ఈ రెండు రోజుల స్పోర్ట్స్ మీట్ జనవరి 3, 4 తేదీల్లో, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్, ముత్యాలంపాడు నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ వర్మ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఏపీ సెక్రటేరియట్ యూనిట్ విజేతలుగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు అధికారులు అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
APSPF
Vijayawada Zone
Sports Meet
Physical Fitness
Discipline
Team Spirit
SPF Units
ప్రభుత్వ ముద్రణాలయం
డా. త్రివిక్రమ వర్మ
Scroll for the next article