Politics15th Sep 05:00 PMSunil Byrisetty1 min read
డీఎస్సీ అవకతవకలపై సమాధానమేది?
ఈనెల 21వ తేదీ విజయవాడలోని శాప్ ఆఫీస్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. డీఎస్సీ పరీక్షల్లో 16 వేలకు పైగా పోస్ట
ఈనెల 21వ తేదీ విజయవాడలోని శాప్ ఆఫీస్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. డీఎస్సీ పరీక్షల్లో 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఈ నియామకాల్లో రోజుకొక అక్రమం బయటకు వస్తోందని విమర్శించారు. పేపర్ లీకేజీలు, ప్రశ్నపత్రాల అమ్మకాలు, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని, అన్నింటికంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయం స్పష్టంగా బయటపడిందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి తప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో పోస్టులు భర్తీ చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం న్యాయవిచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని, అవకతవకలు జరిగాయని భావిస్తే డీఎస్సీతోపాటు ఏపీపీఎస్సీపైన కూడా సీబీఐ విచారణకు ఆదేశించమని ఎప్పుడో చెప్పామని అన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని రాంబాబు పేర్కొన్నారు.