TTD3rd Sep 01:33 PMSunil Byrisetty1 min read

2 కిలోల బంగారం, ఆరున్నర కిలోల వెండి!

టీటీడీలో డిప్యూటీ ఈఓగా పని చేస్తున్న అవినీతి తిమింగలం లోకనాథం నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనిఖీలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్

2 కిలోల బంగారం, ఆరున్నర కిలోల వెండి!
టీటీడీలో డిప్యూటీ ఈఓగా పని చేస్తున్న అవినీతి తిమింగలం లోకనాథం నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనిఖీలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ ఇచ్చిన పక్కా సమాచారంతో, టీటీడీకి చెందిన ఓ డిప్యూటీ ఈఓ నివాసం , కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. ఈ సోదాల్లో అక్రమంగా కూడబెట్టిన 2 కిలోల బంగారం, ఆరున్నర కిలోల వెండి, భారీ ఆస్తుల పత్రాలు, 12.5 లక్షలకుపైగా నగదు బయటపడింది. దీంతో దేవస్థానంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఒక డిప్యూటీ ఈఓ స్థాయి అధికారి ఇంత కూడబెడితే ఇక బడా అధికారుల దగ్గర ఎంతెంత ఉంటుందోనన్న ప్రచారం జరుగుతోంది. ఏడుకొండల వాడి పేరు చెప్పుకుని వందల కోట్లు వెనకేసుకున్న బడా అధికారులు టీటీడీలో పదుల సంఖ్యలో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
TTD
Tirumala Tirupati Devasthanams
TTD Deputy EO
Lokanatham
ACB Searches
Anti Corruption Bureau
TTD News
Tirupati News
Gold Seized
Silver Seized
టీటీడీ అధికారి
ఆంధ్రప్రదేశ్ వార్తలు
తిరుమల
లడ్డూ ప్రసాదం
కల్తీ నెయ్యి వ్యవహారం
ఏసీబీ విచారణ
Scroll for the next article